గేమ్ చేంజర్ నాకు చాలా ప్రత్యేకం..
కొత్త ఏడాదికి ‘గేమ్ ఛేంజర్’తో అభిమానులకు నటి కియారా అద్వాని కనువిందు చేయనున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని కియారా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వాని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. “ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల నుంచి జరుగుతోంది. రామ్‌చరణ్, శంకర్ సర్, తమన్‌లతో నటించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా నాకు వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా సమయంలోనే నా వివాహం జరిగింది. అందుకే నాకు ఈ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని కియారా వెల్లడించారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతోంది. శ్రీకాంత్, అంజలి, నవీన్‌చం ద్ర, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 10 న ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా నెల రోజులు కూడా వ్యవధి లేకపోవడంతో సినిమాకు సంబంధించిన ప్ర మోషన్స్‌ను ప్రారంభించేందు కు సిద్ధమవుతున్నారు.






