12 July, 2026 | 10:57 AM

ఇదొక ఫిక్షనల్ స్టోరీ

14-12-2024 12:00 AM

హీరో అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

బచ్చల మల్లి కథ ఎప్పుడు విన్నారు? 

ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 

-ఇట్లు మారేడుమిల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బచ్చలపల్లి కథ విన్నాను. కథ వినగానే బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. నా మైండ్ లో ఈ కథ ఉండిపోయింది. బచ్చలమల్లి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే కథ. ఇది ఫిక్షనల్ స్టోరీ. 

బచ్చలపల్లి ఎలాంటి కథ? 

లైఫ్ లో తప్పులు చేయొచ్చు. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో బచ్చలపల్లి చూపించాం. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్ ఇది. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. 

కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 

నేనొక ఆడియన్ గానే కథ వింటాను. ఫస్ట్ అఫ్ ఎక్సయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలని భావిస్తాను.  

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి? 

-ఈ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వన్ అఫ్ ది హైలెట్. పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళాయి.  సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. 

హీరోయిన్ అమృత అయ్యర్ గురించి? 

-హనుమాన్ సినిమా టీజర్ చూసి ఆమెను సంప్రదించడం జరిగింది. ఇందులో అమృతది మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. 

ఊరు పేరు భైరవకోనకి సీక్వెల్ ఉందా? 

-అది మా డైరెక్టర్ వీఐ ఆనంద్ చెప్పాలి.   

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ? 

-సందీప్ కిషన్ గారితో చేస్తున్న ‘మజాకా’ నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాగే కిరణ్ అబ్బవరం గారి సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరింది. త్వరలో ఆ వివరాలు చెప్తాను.