కలెక్టరేట్‌లో ఉద్యోగినులకు ఆటల పోటీలు
మేడ్చల్, మార్చి 9 (విజయ క్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారిని చంద్రావతి తో కలిసి ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ సతీమణి ౄr రాధ మను చౌదరి హాజరయ్యారు.
జిల్లా విద్యాధికారిని విజయకుమారి, జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి అధికారి వినోద్, డి ఆర్ డి ఓ సాంబశివరావు, జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్ప్లై అధికారిని సుగుణాబాయి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అజేయలక్ష్మి, మేడ్చల్ డిపో ఏఈ స్నేహలత, TNGO జనరల్ సెక్రటరీ కురు మూర్తి, జాయింట్ సెక్రటరీ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మహిళా వ్యవస్థాపకులకు, మహిళా గ్రూపులకు ముఖ్య అతిథి చేతులమీదుగా సన్మానించారు. తదనంతరం, చెస్, క్యారం, లెమన్ & స్పూన్, స్పీడ్ వాకింగ్ , రన్నింగ్, టగ్ అఫ్ వార్, మ్యుసికల్ చైర్‌ఆటల పోటీలలో విజేతలైన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు.




