27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తా

10-03-2026 12:15 AM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, మార్చి 9: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే  ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష సామాగ్రి కిట్  ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసి, రాష్ట్రస్థాయిలో అత్యున్నత ఫలితాలు సాధించాలని కోరినారు.

అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వెస్టేజ్ స్టోర్ ను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇటీవల మోకాలు ఆపరేషన్ చేయించుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి  గురవమ్మ సైది బాబు, మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.