calender_icon.png 29 July, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా..

29-07-2025 01:03:33 AM

ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, జూలై2౮(విజయక్రాంతి): తానూ ర్ మండలం జరి గ్రామం వెళ్లే రహదారిపై ఉన్న వాగు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. సోమవారం జరి గ్రామానికి చెంది న ప్రజలు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. వర్షాకాలంలో వాగు ప్రభావముల రాకపోకలకు ఇబ్బందిగా ఉం దని ఎమ్మెల్యేకు వివరించారు.

అలాగే అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. సోమవారం కుంటాల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అం దించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు