గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
హైదరాబాద్ : నగరంలోని అర్థరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గంజాయి బ్యాచ్ దాడి ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. కొంతమంది యువకులు గంజాయి తాగుతూ అర్థరాత్రి వరకు రూడ్లపై బైఠాయించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి ఓనర్ జనార్థన్ నాయుడు అనే వ్యక్తి తమ ఇంటి ముందు నుంచి వెళ్లాలని గంజాయి తాగుతున్న పోకిరీలకు చెప్పాడు. దీంతో పోకిరీలు మమ్మల్నే వెళ్లమంటావా అంటూ ఇంటి ఓనర్ పై కర్రలతోనూ, రాళ్లతోనూ విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరిపోయారు. ఈ దాడిలో జనార్థన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతని స్థానిక దవాఖానకు తరలించారు. జనార్థన్ నాయుడుపై జరిగిన దాడిని స్థానికులు సెల్ ఫోన్ ల్లో వీడియో తీశారు. బాధితుడి కుటుంబసభ్యులు సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






