20 August, 2026 | 6:20 PM

జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు షురూ...

14-06-2024 09:53 PM

హైదరాబాద్ : నగరంలో జూలై 7వ తేదీ నుంచి బోనాలు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో మహంకాళి అమ్మవారికి ప్రజలు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. హైదరాబాద్ నగరంలో గోల్కొండలోని జగదాంబిక గుడిలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ సింహవాహిని దేవాలయంలో ఈ బోనాల వేడుకలు ముగుస్తాయి. ప్రజలు ఈ బోనాల జాతరను ప్రతి ఏడాది అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుపుకుంటారు. 150 ఏళ్ల క్రితం నగరంలో కలరా మహమ్మారి రావడంతో ఈ బోనాల పండుగను జరుపుకు న్నట్టుగా చరిత్ర చెబుతుంది. అమ్మవారి ఆగ్రహం కారణంగానే కలరా వ్యాపించిన ట్టుగా ప్రజల విశ్వాసం. అప్పటి నుంచి అమ్మవారికి బోనాల వేడుకను ప్రతి సంవ త్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పా ట్లు నిర్వహిస్తుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.