20 August, 2026 | 11:06 PM

కాంగ్రెస్ హామీలు నీటీ మూటలను తలపిస్తున్నాయి : హరీశ్ రావు

14-06-2024 09:10 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఎ హరీశ్ రావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అన్ని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి 191 రోజులు గడిచినా ఆచరణలో విఫలమైందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఏపీ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రకాల పింఛన్లు పెంచారని తెలిపారు.

ఒడిశా సీఎం వరికి కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.3100 చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి, తక్షణమే వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామిలో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 శాతం మాత్రమే పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీల అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.