10 August, 2026 | 7:22 PM

Breaking News

లోకకళ్యాణార్థం బీరంగూడలో ఘనంగా శతరుద్రాభిషేకం   •   అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •  

గంజాయి విక్రేత అరెస్టు

06-11-2024 02:46 AM

కూకట్‌పల్లి, నవంబర్ 5: గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీ విశాఖపట్నానికి చెందిన రాజు.. గత కొన్నినెలలుగా హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు చేపడుతున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల బస్టాప్ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీ సులు దాడిచేసి అతడి వద్ద నుంచి 2.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు ఇదివరకే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది.