5 August, 2026 | 1:55 AM

నగరంలో గాన్సిడ్ యూఎస్‌ఏ కాంగ్రెస్ 2026

05-08-2026 12:51 AM

బంజారాహిల్స్, ఆగస్టు 4 (విజయక్రాంతి):హైదరాబాద్ వేదికగా గాన్సిడ్ కాంగ్రెస్ 2026 నిర్వహించనున్నట్లు గ్లోబల్ యాక్షన్ నెట్వర్క్ ఫర్ సికిల్ సెల్ అండ్ అదర్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్ (గ్యాన్సిడ్) సంస్థ ప్రకటించింది.తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ అందుకు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు.గ్యాన్సిడ్ సంస్థకు తమ సంస్థ స్థానిక భాగస్వామిగా వ్యవహరించనుందన్నారు.

పరస్పర భాగస్వామ్యంతో అక్టోబర్ 23 నుంచి 25 వరకు హెచ్‌ఐసీసీ నోవోటెల్ లో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నామని ప్రకటించారు.జన్యుపరంగా ఒక తరం నుంచి మరో తరానికి వచ్చే రక్త సంబంధిత వ్యాధుల చికిత్సలో వస్తున్న సరికొత్త మార్పులు,పరిశోధనలు,మెరుగైన వైద్య విధానాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదిక కానుందన్నారు.దేశవిదేశాలకు చెందిన వందలాది మంది ప్రముఖ వక్తలు,టాప్ వైద్యులు,పరిశోధకులు, ప్రయోగశాల శాస్త్రవేత్తలు,రోగుల సంక్షేమ సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు, పాలసీ మేకర్లు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.