గ్యాస్ వినియోగదారులు నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి
18-06-2026 12:00 AM
జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్, జూన్ 17 (విజయక్రాంతి): ఎల్ పి జి గ్యాస్ వినియోగదారులు 30వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్స్, ఎల్పిజి డీలర్లు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వినియోగదారులందరూ ఈ కేవైసీ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 14 49 460 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో నాలుగు లక్షల 32 వేల వినియోగదారుల ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ కేవైసీ చేసిన వారికి సబ్సిడీలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో ఉప్పల్, బాలానగర్ డివిజన్లో సహాయ పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.






