18 June, 2026 | 2:43 AM

సత్యవాన్ సావిత్రి తెలుగువాళ్లను పలుకరించదా?

18-06-2026 01:54 AM

గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. ఇప్పుడీ నవతరం సహజ నటి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక కీర్తి సురేశ్ చేతిలో ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. ఇవేకాక విక్టరీ వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి గురువారం ప్రారంభించనున్న కొత్త సినిమాలోనూ కీర్తి ఓ కథానాయికగా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే ‘సత్యవాన్ సావిత్రి’ అనే ఓ కోర్ట్ రూమ్ డ్రామాతో కీర్తి సురేశ్ త్వరలో ప్రేక్షకులను పలుకరించబోతోంది.

కీర్తి ఈ తాజా చిత్రంలో న్యాయవాది పాత్రలో కనిపించనుంది. నటుడు, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చారుకేష్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, మధు సూదనన్, ఆర్ సుందరరాజన్, బ్రిగిడ సాగా, మాలా పార్వతి, ఏ వెంకటేశ్ ముఖ్యపాత్రల్లోకనిపించనున్నారు.

ఈ చిత్రానికి వేదిక కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మాత కాగా, ఈ సినిమాతో ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్. జూలై 24న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలోనే విడుదలతోంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తోనూ రిలీజ్ అవుతోంది. అయితే, ఈ సినిమా తెలుగులో విడుదలపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కీర్తి సురేశ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని డబ్ చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.