అవినీతి నిర్మూలన కోసం టీజేఎస్ పోరాటం
ఎమ్మెల్సీ కోదండరాం
నాగోల్‌లో టీజేఎస్ మహిళా కార్యాలయం ప్రారంభం
పలువురు పార్టీ సభ్యత్వం స్వీకరణ
నాగోల్, జూన్ 17 (విజయక్రాంతి): సమాజంలో అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ఆవిర్భవించిందని, ఆ లక్ష్యం సాధించే వరకు పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. నాగోల్లో టీజేఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్తూరి పుష్పనీలా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజేఎస్ మహిళా కార్యాలయాన్ని ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ లక్ష్మీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్తో పాటు తెలంగాణ ఉద్యమ వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, విద్యావంతులు, మహిళలు టీజేఎస్ పార్టీలో చేరారు. అలాగే మమతానగర్కు చెందిన విద్యార్థి నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 100 మందికి పైగా టీజేఎస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ మన్నేపల్లి లక్ష్మణ్, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కులభూషణ్, కన్నయ్య, రాపోలు కృష్ణ, బాలరాజు, సంగారెడ్డి మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి, కామారెడ్డి మహిళా అధ్యక్షురాలు రాణి, భూపాలపల్లి మహిళా అధ్యక్షురాలు లావణ్య, రంగారెడ్డి మహిళా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, కమ్మరి గౌరీ తదితరులు పాల్గొన్నారు.






