పెద్దితో గౌర్నాయుడు కుస్తీ!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 4న విడు దల కానున్న ఈ మూవీ ప్రీమియర్స్ జూన్ 3న ప్రారంభం కానున్నాయి.
మే 18న ముంబై వేదికగా జరిగే ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడు దల చేయనున్నారు. అంతకన్నా ముందే మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను ‘గౌర్నాయుడు’గా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శివరాజ్‌కుమార్ కుస్తీ బరిలో పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపించడం ఆకట్టుకుంది.
‘రామ్ బుజ్జి’గా దివ్యేందు శర్మ
సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ మూవీ ప్రమోషన్స్ మేకర్స్ ఎంతో ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందుశర్మ పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్ర ‘రామ్ బుజ్జి’ని పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. క్రికెట్ మైదానంలో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ యాటిట్యూడ్ పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా చూపించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు; ఎడిటింగ్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.






