కరీంనగర్ వాసి గౌతమ్ కృతజ్ఞతేజకు డాక్టరేట్
23-06-2024 03:13 AM
కరీంనగర్, జూన్ 22 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన గౌతమ్ కృష్ణతేజకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆర్.సుధాకర్‌గౌడ్ పర్యవేక్షణలో జియో డైనమిక్స్ ఆఫ్ బార్రెన్ ఐలాండ్ వాల్కనిజం, ఇన్‌సైడ్స్ ప్రొమ్ జియో స్పెషల్ టెక్నాలజీ అనే అంశంపై కృష్ణతేజ పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగోళశాస్త్ర ప్రొఫెసర్ నగేశ్ ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టాను అందజేశారు. కృష్ణతేజను తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ యాదగిరి అభినందించారు.






