7 May, 2026 | 8:32 PM

పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు సన్మానం

23-06-2024 03:16 AM

హనుమకొండ, జూన్ 22(విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా సన్మానించారు. శనివారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని వారి నివాసానికి గడ్డం సమ్మయ్య వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు సమ్మయ్యను ఘనంగా సత్కారించారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం జనగామ జిల్లాకే గర్వకారణమని కడియం శ్రీహరి కొనియాడారు. కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి పాల్గొన్నారు.