21 May, 2026 | 2:40 AM

హైదరాబాద్ వెలుపలా జీసీసీలు

21-05-2026 01:28 AM
  1. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీ రూపొందించండి
  2. ఫ్యూచర్ సిటీలో ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రం ఏర్పాటుకు కేంద్రంతో చర్చలు జరపాలి
  3. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ‘టీ--ఫైబర్’ వినియోగంలోకి తేవాలి
  4. ఐటీ, పరిశ్రమల శాఖలపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : ఐటీ వెలుగులు హైదరాబాద్ మహానగరానికే కాదు.. జిల్లాలకూ విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటిం చారు. హైదరాబాద్ అవతల కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, నిజామా బాద్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూ చించారు.

బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కే.శ శాంక, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలన్నారు. ‘బియాండ్ క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్) ప్రాంతాలను గుర్తించి అ క్కడ ఐటీ, డేటా సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. 

నెట్ జీరో డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలు..

భారత్ ఫ్యూచర్ సిటీ(బీఎఫ్‌సీ)లో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో పాటు పూర్తిగా పర్యావరణహితంగా, నెట్- జీరో డిజైన్‌లతో కూడిన విధానాలు అమలు చేయాలని, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ ప నుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీ లో ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రం ఏర్పా టు కోసం కేంద్రంతో చర్చలు జరపాలని, అవసరమైతే తాను కూడా ప్రధానమంత్రితో మాట్లాడుతానన్నారు.

ఫ్యూచర్ సిటీ పారిశ్రామిక వాడలో వివిధ కంపెనీలకు సంబంధిం చి త్వరలో భూమి పూజ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృ ద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా, రా ష్ట్రానికి భారీ పెట్టుబడులు రప్పించేందుకు ఇ న్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏ ర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.    

అనుమతులు, సేవలు ఒకే వేదికపై నుంచి అందాలి..

పెట్టుబడిదారులకు అన్ని రకాల అనుమతులు, సేవలు ఒకే వేదికపైనుంచి అందేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇ న్వెస్ట్ తెలంగాణ పేరున ప్రభుత్వం ఒక సొసై టీ ఏర్పాటు చేయనుండగా, అందులో ఐటీ, పరిశ్రమ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిం చనున్నారని, ఎనర్జీ, ఫైనాన్స్ శాఖల అధికారులు  ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని సీఎం తెలిపారు.

పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు సహకరించే విధంగా ఇన్వెస్ట్ తెలం గాణ పని చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ- ఇంటర్నెట్‌ను వినియోగంలోకి తేవాలని సీఎం స్పష్టం చేశారు. కాగా టీ మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

మధ్యాహ్నం బయటకు రావొద్దు 

తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర త ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లా ల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగు నీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొద లు జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం సూ చించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎ ప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

సీఎంను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

సీఎం రేవంత్‌రెడ్డిని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ భోది పెవిలియన్ లో 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ని కలిసిన వారి లో ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్,  పారస్ కుమార్,  సురేష్, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. 

డ్రగ్స్ బాధితులకు డీ అడిక్షన్ సెంటర్లు

రాష్ట్రంలో డ్రగ్స్ బాధితుల కోసం ప్ర త్యేక డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చే యాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. పోలీస్ డిపార్ట్‌మెం ట్‌లో ఎస్‌ఐ స్థాయి నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేయాలని సూచించారు. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు.

ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లని పెంచుకో వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలీస్ ట్రైనింగ్‌లోనే సైబర్ క్రైమ్ విభాగం లో పనిచేయడం కోసం సెలక్షన్ జరగాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని విభాగా లు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం బాగా పెరగాలన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికత ను పెంచాలన్నారు.

ప్రభుత్వాదాయానికి గండి కొట్టే వారిపై విజిలెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డేటా అనాలసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పై విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలని, వి జిలెన్స్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్ర మాదం జరిగిన తర్వాత కాకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్‌మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూ చించారు.

మునిసిపల్ డిపార్ట్‌మెంట్, హై డ్రాతో సమన్వయం చేసుకొని ఫైర్ డిపార్ట్‌మెంట్‌పై జూన్ 15లోగా సమ గ్ర నివేదిక సి ద్ధం చేయాలన్నారు. నాలాల మెయింటెనెన్స్‌లో మెట్రో వాటర్ వర్క్స్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్స్ నిర్వహణపైన పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, ము నిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.

నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీ లు కడుతుం టే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను సీఎం ప్రశ్నిం చారు. ఫ్లెక్సీలను ఖచ్చితంగా నియంత్రించాల్సిందేనని తేల్చి చెప్పారు. పోలీస్ కమిష నర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలపైన కఠినంగా ఉండాలని ఆదేశించారు. నైట్ పెట్రోలింగ్‌ను పెంచాలని సీఎం ఆదేశించారు.