31-05-2025 12:00:00 AM
- 2024 ఏడాదికి గాను 6.5 శాతం వృద్ధి రేటు
న్యూఢిల్లీ, మే 30: భారత ఆర్థిక వ్య వస్థ వృద్ధిలో వేగం కాస్త మందగించి ంది. శుక్రవారం విడుదలైన అధికారి క గణాంకాల ప్రకారం, 2024 పూ ర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శా తంగా నమోదైంది.
అంతకుముం దు ఆర్థిక సంవత్సరమైన 2023 24లో నమోదైన 9.2 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల అని జా తీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ వో) వెల్లడించింది. దీంతో జీడీపీ నా లుగేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని తెలిపింది. 2024 పూర్తి ఆర్థిక స ంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.5 శా తంగా ఉండవచ్చని ముందస్తు అంచనాల్లో పేర్కొం ది.
ప్రస్తుతం విడుదలైన గణాంకాలు ఆ అంచనాలకు అనుగుణంగానే ఉ న్నాయి. 2024 ఆర్థిక సంవత్స రం చివరి త్రైమాసికం విషయానికొస్తే జీడీపీ వృద్ధి రేటు 7.4 శా తంగా నమోదైంది. అయితే 2౦ 23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువేనని ఎన్ఎస్వో గణాంకాలు స్పష్టం చేశాయి.