6 July, 2026 | 4:07 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

వెలువర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు స్వతంత్ర హోదా కల్పించాలి

30-05-2025 05:25 PM

ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు స్వతంత్ర హోదా కల్పించాలని, ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డిప్యూటీ డెమో అధికారి అంజయ్య(Deputy Demo Officer Anjaiah)కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ 2006 సంవత్సరంలో ప్రారంభించిన వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేటి వరకు గెజిటెడ్ హోదా కల్పించలేకపోయారు.

దీంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు గాని, వివిధ సంతకాల కోసం వచ్చే ప్రజలు గాని వేములకొండ ఆసుపత్రి పై ఆధారపడవలసి వస్తుందని వెంటనే స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండే విధంగా కేటాయించినప్పటికీ కేవలం ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో డ్యూటీ నిర్వహిస్తున్నారని మరొక డాక్టర్ ను వలిగొండకు డిప్యూటేషన్ పై పంపించారన్నారు. గతంలో కూడా వేములకొండ మరియు ఆత్మకూర్లకు ఇదే రకంగా డిప్యూటేషన్ లపై పంపించడం జరిగిందని పేరుకు మాత్రమే డాక్టర్లని వారిని వివిధ ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారని వెంటనే డిప్యూటేషన్లను రద్దుచేసి వెలువర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్, సిహెచ్ఓ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్వీపర్ మరియు నైట్ వాచ్ మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి వెలువర్తి ఆసుపత్రి సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు కలుకూరి ముత్యాలు, వేముల అమరేందర్, నాయకులు వేముల నాగరాజు, మచ్చ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.