calender_icon.png 6 December, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రత్నాపూర్ రాతిచిత్ర రత్నాలు

16-10-2024 12:00:00 AM

శ్రీరామోజు హరగోపాల్ :

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 15 రాతి చిత్రాల తావులు లభించాయి. శివంపేట మండలంలోని రత్నాపూర్‌లో కొత్తగా అద్భుతమైన రాతి చిత్రాల తావులో ఆ గ్రామానికి ఆగ్నేయంగా తిరుమలాయ బండ అనే పరుపు బండ, గ్రానైట్ బోడుమీద 40 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తున్న ఏకశిల రాతి గోడమీద ఎరుపు రంగులో రాతి చిత్రాలున్నాయి.

ఈ తావును తిరుమలాయ గుట్ట మీద విష్ణుకుండినుల నాటి శిథిలమైన వైష్ణాలయం ఉంది. గర్భగుడిలో మూర్తిలేదు. ధ్వజస్తంభం కూలిపోయింది. ఆ బండ అంచున ఉంది. ఉత్తర దిశలో పురాతన నివాసాల జాడలగుపిస్తున్నాయి. ఈ చిత్రాల జాడ చెప్పింది నాయని నర్సింహారెడ్డి అనే జర్నలిస్టు. 

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీ కృష్ణ, సహాయకుడు నాగరాజు లను గైడ్ చేసింది తెలంగాణ జాగృతి నాయకులు జి.మోహన్‌రెడ్డి. సాయికృష్ణ ఈ ఎక్స్‌ప్లోరేషన్‌లో పాల్గొన్నారు. తావు వారితో ఉన్నవారు రత్నాపూర్ గ్రామస్థులు మన్నె చిన్న నర్సింహులు, గాజుల పోచయ్య, గన్యా రత్నకుమార్, గాజుల బాల య్య, చందిప్రసాద్, దేవిప్రసాద్, జయరాం పంతులు. 

బొమ్మల కాన్వాసుకు కింద కుడిచేతివైపు మూలన నగ్నమైన మనిషి తల చుట్టూ కాంతి ప్రభలతో గీయబడి ఉన్నాడు. అతని కుడి చేతి కింద ఒక మూపురం, ఎద్దు, తలపైన మరొక ఎద్దు, ఎరుపు రంగు నింపిన బొమ్మలు, మూడవది గీతలతో ఉన్న ఇంకొక ఎద్దు అతని కాళ ్లకింద ఉంది. నగ్నత, కాంతిప్రభల ఆధారంగా ఈ బొమ్మలో ఉంది భైరవుడని చెప్పవచ్చు.

అతనికి ఎడమ చేతివైపున్న బొమ్మలు మాసిపోయి ఉన్నాయి. తలకు ఎడమవైపున తాడుమీద నడుస్తున్న మనిషి వలె కనిపిస్తున్నాడు.

ఈ చిత్రాల్లో రెండు, మూడు దశల బొమ్మలున్నట్టు బొమ్మల వెనక బొమ్మలు డిజైన్లలో కనపడటం మధ్యశఙలాయుగాని చెందినవిగా పైనున్న దుప్పి, నెమళ్లు, మనిషి (పురు షాంగంతో), ఎద్దులు (అవయవ స్పష్టతతో) యివన్నీ కొత్తరాతియుగానికి (కాంస్యయుగానికి) చెందినవిగా భావించాలి.

(కృష్ణ శాస్త్రి- 1983- కోకాపేట), మిగతావన్ని మధ్యయుగాల నాటివి. కొత్తగా రథాల్లో కూర్చుని చేస్తున్న యుద్ధం దృశ్యాలు, విల్లువాడటం, భైరవుని బొమ్మకిందుగా మూలన విల్లుబొమ్మ కనిపిస్తున్నాయి.