calender_icon.png 29 September, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కమిషన్ సభ్యురాలిని సన్మానించిన జెన్‌కో ఎంప్లాయీస్ అసోసియేషన్

29-09-2025 12:20:11 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 28, (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్ర మహిళా కమి షన్ సభ్యురాలు, చాకలి ఐలమ్మ ముని మనమరాలు చిత్యాల శ్వేత ను ఆదివారం కేటీ పీఎస్ ఏ కాలనీ గెస్ట్ హౌస్ లో జన్కో ఎంప్లాయిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా వారు పాల్వంచలో నీకేటిపిఎస్ కాంప్లెక్స్ లో తొలగించిన విద్యుత్ కర్మాగారం స్థానంలో కొత్త విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాలని, కేటీపీఎస్ నుంచి రే డిప్లమెంట్లో బి టి పి ఎస్, వై టి పి ఎస్ బది లీ చేసిన ఉద్యోగులను వెనక్కు తీసుకురావాలని, స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా జె న్కో ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు అశోక్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల కోసం చేసిన త్యాగాలను కొనియాడా. సంగం వ్యవస్థాపక అధ్యక్షులు ము దిగొండ సత్యనారాయణ సంఘానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఆర్, ధర్మరాజుల నాగేశ్వరరా వు, శ్రీను, రెడ్డి రాజుల వెంకట్, చిట్యాల సో మయ్య, వెంకటేశ్వర్లు, కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.