calender_icon.png 29 September, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు

29-09-2025 12:21:44 AM

-అంబర్‌పేటలో రూ. 4,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం 

-రూ.539 కోట్లతో పూర్తి చేసిన ఆరు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):  హైదరాబాద్ మహానగర భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేస్తూ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సీఎం రేవం త్ రెడ్డి భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చు ట్టారు. అంబర్‌పేట నియోజక వర్గం కేంద్రంగా రూ. 4,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఒకే రోజు పూర్తయిన మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఎస్టీపీ జాతికి అంకితం చేయడంతో పాటు, కొత్తగా నిర్మించనున్న ఎస్టీపీలకు భూమి పూజ చేశారు. 

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మురుగునీటి శుద్ధి వ్యవస్థను ఆధునీకరించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా, రూ. 539.23 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆరు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  రూ. 3,849.10 కోట్ల అంచనా వ్యయంతో నగరం అంతటా కొత్తగా 39 ఎస్టీపీల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.  

ప్రారంభించిన ఎస్టీపీల వివరాలు..

-అంబర్‌పేట : 212.50 ఎంఎల్డి. రూ. 319.43 కోట్లు

-అత్తాపూర్ రాజేంద్రనగర్ : 64 ఎంఎల్డి.  రూ. 109.24 కోట్లు

-ముల్లకతువా కూకట్‌పల్లి : 25 ఎంఎల్డి. రూ. 44.46 కోట్లు

-శివాలయ నగర్ కుత్బుల్లాపూర్ :  14 ఎంఎల్డి. రూ. 34.13 కోట్లు

-వెన్నలగడ్డ కుత్బుల్లాపూర్: 10 ఎంఎల్డి. రూ. 13 కోట్లు

-పాలపిట్ట శేరిలింగంపల్లి: 07 ఎంఎల్డి. రూ. 18.97 కోట్లు