5 May, 2026 | 1:56 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

‘లింగ నిర్ధారణ’ యంత్రం పట్టివేత

27-10-2024 01:17 AM

కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జిల్లాకేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది లింగ నిర్ధారణ పరీక్ష చేసే యంత్రాన్ని పట్టుకున్నారు. వరుస ఘటనలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తండ్రీకొడుకులు వైద్యులు. వారు అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ గతేడాది పట్టుబడ్డారు. ఎలాగోలా బయటకు వచ్చారు. ఆరునెలల క్రితం కుమారుడు మరో ప్రైవేట్ ఆసుపత్రి తెరిచాడు.

కుమారుడు ఇటీవల ఓ మహిళకు గర్భస్రావం చేసి, ఆమె కుటుంబం నుంచి రూ.80 వేలు తీసుకున్నాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. తిరిగి అదే ఆసుపత్రిలో పనిచేసిన బల్ల రవి అనే వ్యక్తి రాజంపేట మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. రవిని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వైద్యాధికారులకు లింగ నిర్ధారణ యంత్రం పట్టుబడింది. నిందితులు ఓ వాహనంలో యంత్రాన్ని తరలిస్తుండగా పట్టుబడింది. కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం.