27-10-2024 01:21:01 AM
నిర్మల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ పరివ్రమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం గుండంపల్లిలో రైతులు ఆందోళన చేశారు. గ్రామాలకు సమీపంలో పంట పోలాల మధ్య పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని రైతులు ఆందోళన చేస్తున్నా.. అధికారులు పనులు ఆపకపోవడం దారుణమని అన్నారు. అధికారులు స్పందించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.