calender_icon.png 7 July, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనరల్ నాలెడ్జ్

06-07-2025 12:00:00 AM

ఆవు పాలకంటే మేక పాలే సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు.. ప్రొటీన్ శాతం కూడా మేక పాలల్లోనే అధికం.

ఇరవై వాట్ల ఎల్‌ఈడీ బల్బును వెలిగించగలిగేంత విద్యుత్తును మనిషి మెదడు ఉత్పత్తి చేయగలదట.

మెదడులోని అడెనోసిన్ అనే రసాయనం వల్ల మనకు అలసిపోయిన భావన కలుగుతుందట. కెఫిన్‌కు దాన్ని అడ్డుకునే గుణం ఉండటంతో కాఫీ తాగగానే కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుందన్నమాట.

నియానీమార్ఫిక్  వయసు కంటే చిన్నగా కనిపించే వాళ్లను వర్ణించేందుకు వాడే ఆంగ్ల పదం ఇది.

తమ ఉత్పత్తులపైన చైనా అంటించే ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్లలో కొన్నిటిని ఆ దేశం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. 

1787లో అమెరికా అధికారికంగా ముద్రించిన తొలి నాణెం మీద ఉన్న స్లోగన్ యువర్ బిజినెస్.

ఎ, బి, సి, డిలను ఆంగ్లంలో ఆల్ఫాబెట్స్ అంటారని తెలుసు కదా.. అసలా ‘ఆల్ఫాబెట్’ అనే పదం భాషలో మొదటి రెండు పదాలైన ఆల్ఫా, బీటా నుంచి వచ్చిందట. 

అడవుల్లోని చెట్లను నరికి వేయడంపై నిషేధం విధించిన మొట్టమొదటి దేశం నార్వే. చెట్లను కొట్టేసేందుకు అవసరమయ్యే గొడ్డలి, రంపం తదితర సామగ్రి అమ్మకాన్నీ అక్కడ నిలిపివేశారు.

అవి 1928 ఒలింపిక్స్.. పడవ పందెం క్వార్టర్ ఫైనల్స్.. బాబీ పియర్స్ అనే ఆస్ట్రేలియా వ్యక్తి రేస్ మధ్యలో ఉండగా.. బాతుల గుంపు ఒకటి ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లడాన్ని గమనించి ఆగిపోయాడు. దాంతో ప్రత్యర్థి కంటే అయిదు మీటర్లు వెనకబడినా, చివరకు 30 సెకన్ల తేడాతో విజేతగా నిలిచాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద మైసూర్‌పాక్ స్టోర్ మైసూర్‌లో ఉంది. ఈ ‘వరల్డ్ ఆఫ్ మైసూర్‌పాక్’లో వివిధ వెరైటీల తయారీ నుంచి రుచి వరకూ సమస్త చూడొచ్చు.