12 July, 2026 | 2:37 AM

అభినవ ఐన్‌స్టీన్ సబ్రినా

12-07-2026 01:29 AM
  1. ఆధునిక సైన్స్ రంగంలో ౩౨ ఏళ్ల యువతి రాణింపు
  2. 1౪ ఏళ్లకే విమానం తయారీ.. తానే నడిపి గాలిలో చక్కర్లు
  3. ఫిజిక్స్‌లో అద్భుతమైన ప్రయోగాలు.. విజయాలు
  4. విశ్వ రహస్యాలను ఛేదించే దిశగా అడుగులు

న్యూయార్క్, జూలై ౧౧: ఆధునిక సైన్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తగా సబ్రినా గొంజాలెజ్ పాస్టర్స్కీ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 32 ఏళ్ల క్రితం చికాగోలో జన్మించిన ఈ యువతిని ఇప్పుడు యావత్ ప్రపంచం ‘అభినవ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్’ కీర్తిస్తున్నది. అందుకు కారణం ఆమెకు భౌతికశాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు ఉన్న ఇంటెలిజెన్స్ కోషన్స్ (ఐక్యూ) ఉండటం. ఐన్‌స్టీన్ వదిలివెళ్లిన ఎన్నో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లనూ ఛేదించే సామర్థ్యాలు ఆమెకున్నాయని నార్తన్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్ (నాసా) విశ్వసిస్తున్నదంటే, ఆమె ఎంతటి శక్తిమంతురాలైన శాస్త్రవేత్తో అర్థం చేసుకోవచ్చు.

నాసా, బ్లూ ఆరిజిన్ వంటి దిగ్గజ సంస్థలు ఆమెకు కోట్లాది రూపాయలు ఆఫర్ చేశాయి. అయినప్పటికీ సబ్రినా కొలువుల ఆఫర్‌ను తిరస్కరించారు. మరిన్ని విశ్వం పుట్టుక ‘సోర్స్‌కోడ్’ను ఛేదించడమే తన లక్ష్యమని, నిరంతరం ప్రయోగాలు చేయడమే తాను నిర్దేశించుకున్న లక్ష్యమని ఆమె ప్రకటించారు. పరిశోధనకు గాను ఆమెకు సైమన్స్ ఫౌండేషన్ నుంచి 8 మిలియన్ డాలర్ల భారీ గ్రాంట్ లభించింది. 

చిన్నతనం నుంచే ప్రయోగాలు

సబ్రినా చిన్నతనం నుంచే ఎంతో విలక్షణమైన ప్రతిభను కనబరిచేవారు. ౧౨ ఏళ్ల వయస్సులోనే ఆమె సొంతంగా తన ఇంటి గ్యారేజ్‌లో విమానం తయారీ ప్రారంభించారు. అలా రెండేళ్ల పాటు శ్రమించి తయారీని పూర్తి చేశారు. ౧౪ ఏళ్ల ప్రాయంలోనే తాను తయారు చేసిన విమానంలో గాలిలో చక్కర్లు కొట్టారు. విమానాన్ని తానే స్వయంగా నడపడటం విశేషం. ఆమె గ్రాడ్యుయేషన్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పూర్తయింది.

కోర్సులో అద్భుతమైన ప్రతిభచటారు. తన ప్రతిభ కష్టసాధ్యమైన ఓర్లాఫ్ స్కాలర్‌షిప్ అందుకున్నారు. అనంతరం ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆండ్రూ స్ట్రోమింగర్ పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే సబ్రినా గురుత్వాకర్షణ, రోదసి సమయంపై ‘స్పిన్ మెమరీ ఎఫెక్ట్’ పేరిట లోతైన పరిశోధన చేశారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన జీవిత చరమాంకంలో కృష్ణబిలాల(బ్లాక్ హోల్స్)పై రాసిన సైన్స్ జర్నల్స్‌లో సబ్రినా పరిశోధనలను ఉదాహరించడం గమనార్హం.

ఐన్‌స్టీన్ వదిలిన సవాళ్లు

ప్రస్తుతం సబ్రినా ఐన్‌స్టీన్ వదిలివెళ్లిన అతిపెద్ద చిక్కుముడులను విప్పేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఆధునిక భౌతికశాస్త్రం ప్రధానంగా రెండు సిద్ధాంతాలపై ఆధారపడి నడుస్తుంది. ఒకటి గ్రహాల గమనాన్ని వివరించే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతమైతే, మరొకటి పరమాణువుల కదలికలను గుర్తించే క్వాంటం మెకానిక్స్. అయితే.. ఈ రెండు ‘బిగ్ బ్యాంగ్’ సమయంలో సంభవించిన పరిణామాలను లెక్కకట్టలేవు. పరమాణువుల చలనశీలతను అంచనా వేయలేవు.

ఈ రెండు భిన్న సిద్ధాంతాలను కలగలిపి ‘క్వాంటం గ్రావిటీ’ని కనుగొనడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన ‘మెట్ గాలా 2026’ వేడుకల్లో సబ్రినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అది ఫ్యాషన్ షో అయినప్పటికీ, షో హాజరైన తర్వాత ఆమె మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.