30 March, 2026 | 6:21 PM

ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి

30-03-2026 04:50 PM

- ఎస్టీయుటిఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు భూములయ్య యాదవ్ అన్నారు. సోన్ మండలంలోని పాక్ పట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లూరి వెంకన్న పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అనేకసార్లు తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పిన అవి పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఎన్నికల  మేనిఫెస్టో హామీ ప్రకారం ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేయాలన్నారు.

బిల్లుల చెల్లింపుకు సంబంధించి నెలకు 700 కోట్ల స్థానంలో 1500కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనికోరారు. బీహార్ తరహాలో టెట్ పరీక్ష కనీస అర్హత మార్కులను తగ్గించుటకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. విద్యా కమిషన్ సిఫార్సుల్లో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, జిల్లా హెడ్ క్వార్టర్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్,  సోన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్, ఎం.సి. నరసయ్య తదితరులు పాల్గొన్నారు