26 August, 2026 | 10:05 PM

ఇంగ్లాండ్ వన్డేలకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ

22-06-2026 12:48 AM

విరాట్‌కు నేడు ఫిట్‌నెస్ టెస్ట్

ఇంగ్లాండ్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన 

ముంబై, జూన్ 21: ఇంగ్లాండ్ టూర్ లో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కోసం ఎంపికయ్యారు. అయితే కోహ్లీ ఫిట్‌నెస్ సాధిస్తేనే వన్డే సిరీస్‌లో ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ఐపీఎల్ 19వ సీజన్ సందర్భంగా కోహ్లీ కాలికి గాయమైంది.

ఈ కారణంగానే ఆప్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్‌లో విరాట్ ఆడలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న కోహ్లీ సోమవారం బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించే ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. ఈ టెస్టులో పాసైతేనే కోహ్లీ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ బుమ్రా ఇంగ్లాండ్ పై వన్డేలు ఆడబోతున్నాడు. వర్క్ లోడ్ కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు బుమ్రా ను ఎంపిక చేయలేదు.

క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్‌తో పాటు దేశీయ, అంతర్జాతీయ క్రీడా విశేషాలను మా క్రీడా వార్తలు పేజీలో తెలుసుకోండి.

అయితే 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా బౌలింగ్ కాంబినేషన్‌ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు బుమ్రా ను బరిలోకి దింపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత బుమ్రా వన్డే ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చివరిసారిగా ఈ స్టార్ పేసర్ 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడా డు. ఇదిలా ఉంటే ఇంగ్లాం డ్‌తో వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టడం ఆశ్చర్యపరిచింది.

తాజాగా ముగిసిన ఆప్ఘనిస్థాన్ సిరీస్ లో జైస్వాల్ రాణించాడు. చివరి వన్డే సెంచరీతో చెలరేగినా అతన్ని ఎంపికచేయకపోవడం చర్చనీ యాంశమైంది. అటు స్పిన్ విభాగంలో కుల్దీ ప్ యాదవ్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. పేసర్లుగా బుమ్రాతో పాటు ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్, గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు. ఆల్ రౌండ ర్ కోటాలో నితీష్ రెడ్డి, అక్షర్  ఎంపికయ్యారు.

ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు:

గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ముఖ్యమైన బ్రేకింగ్ అప్‌డేట్స్‌ను మా తాజా వార్తలు విభాగంలో చదవండి.

FAQ's

1. ఇంగ్లాండ్ వన్డేలకు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడా?

అవును. అయితే ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే కోహ్లీ తుది జట్టులో ఆడనున్నాడు.

2. జస్ప్రీత్ బుమ్రా ఎన్ని సంవత్సరాల తర్వాత వన్డేల్లోకి వస్తున్నాడు?

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జస్ప్రీత్ బుమ్రా వన్డే ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు.

3. యశస్వి జైస్వాల్‌కు భారత జట్టులో చోటు దక్కిందా?

లేదు. ఇటీవల సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు జైస్వాల్‌ను ఎంపిక చేయలేదు.

4. భారత వన్డే జట్టుకు కెప్టెన్ ఎవరు?

శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

5. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టులో ముఖ్య ఆటగాళ్లు ఎవరు?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తదితరులు జట్టులో ఉన్నారు.