calender_icon.png 5 December, 2024 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తిగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటా

18-07-2024 01:31:21 AM

ఇటీవల తన చేతికి తీవ్ర గాయాలయ్యాయని నటుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఈ విషయమై ఓ లేఖ రాసి ఆ ఫొటోను తాజా గా ఇన్‌స్టాలో ఉంచగా, ఆ వార్త వైరల్‌గా మారింది. ఈ పోస్టులో నవీన్ పొలిశెట్టి తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు. ‘మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దురదృష్ణవశాత్తు నా కుడి చేతికి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇది నాకు క్లిష్ట సమయం. గాయాల కారణంగా త్వరితగతిన నా సినిమాలను మీ ముందుకు తీసుకురాలేకపోతున్నా. అందు కు క్షమించండి. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నా తర్వాతి చిత్రానికి సంబంధించి స్ట్రిప్ట్ అద్భుతంగా సిద్ధమైంది. అది మీకు బాగా నచ్చుతుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత షూట్‌లోకి అడుగుపెడతా. మీ ప్రేమాభిమానాలు నాలో స్ఫూర్తి నింపాయి. అతి త్వరలో మళ్లీ స్క్రీన్ మీద కనిపించి మీకు వినోదం పం చుతా’ అని ఆ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ట్యాగ్ చేసిన ఫొటోలో నవీన్ పొలిశెట్టి చేతికి, కాలికి కట్లు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.