calender_icon.png 13 September, 2024 | 12:42 AM

చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పడంలేదు

18-07-2024 01:33:27 AM

‘పేకమేడలు’ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని  

వినోద్ కిషన్ కృష్ణ జంటగా నటించిన చిత్రం ‘పేకమేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రేజీ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ వర్రే నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా.. ఇటీవలే వైజాగ్, విజయవాడల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ప్రేక్షకుల నుం చి మంచి స్పందన వస్తుండటంతో బుధవారం చిత్రబృందం విలేకరులతో ముచ్చటించింది. ఈ సంద ర్భంగా ఈ సినిమాకు పంపిణీదారుగా వ్యవహరిస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడారు. “నేను ‘పేకమేడలు’ సినిమా స్పెషల్ షో చూసిన తర్వాత అనుకున్నా.. ఇంత మంచి సినిమాను ఇంకా బాగా ప్రమోట్ చేస్తే ప్రేక్షకుల్లోకి వెళ్తుంది అని!

ఇంత మంచి సినిమాను అందరూ చూడాల్సిందేననిపించి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమయ్యా. ఈ సినిమా కోసం టికెట్ రేట్లను రూ.100కు తగ్గించాం. ప్రత్యేక షోలనైతే రూ.50కే టికెట్ ఇచ్చాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ ధర ఎంత ఉన్నా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. కానీ చిన్న సినిమాల మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో, హీరోయిన్ మాట్లాడారు. తమ సినిమాను రానా దగ్గుబాటి, అడివి శేష్, విష్వక్ సేన్‌లు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని వారు తెలిపారు.