03-12-2025 12:00:00 AM
గీతంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బీ.ఎస్.మూర్తి ఉద్బోధ
పటాన్ చెరు, డిసెంబర్ 2 :నిజమైన ఆవిష్కరణకు క్రమశిక్షణా సరిహద్దులు లేవని, ఆచార్య జగదీష్ చంద్రబోస్ వంటి దార్శనికుల నుంచి ప్రేరణ పొందాలని ఐఐటీ హైదరాబాదు డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. మూర్తి పిలుపునిచ్చారు. ‘జేసీ బోస్ ను మనం గు ర్తుంచుకున్నప్పుడు, మీరు ఒక ఆవిష్కర్త కా వాలనుకుంటే ఎటువంటి అడ్డంకులు ఉండబోవని తెలుసుకోవాలి’ అని ఉద్బోధించా రు.
జేసీ బోస్ 167వ జయంతి సందర్భంగా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘పాపులర్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. జేసీ బోస్ ఆవిష్కరణలు జీవశాస్త్రానికి మించి మైక్రోవేవ్ లు, ప్రారంభ టెలికమ్యూనికేషన్ల వంటి ఇంజనీరింగ్ విభాగాలకు కూడా విస్తరించాయని, అటువంటి మహనీయుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని సూ చించారు.
భారతదేశ అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ వ్యక్తపరిచిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ (అభివృద్ధి, స్వాలంబన) యొక్క జాతీయ దృక్పథం గురించి వివరించారు. దిగుమతులను తగ్గించడానికి, స్వావలంబనను పెంపొందించడానికి అన్ని రంగాలలో ఇలాంటి వేగం అవసరమని ఆయన అన్నారు.
ఐఐటీ హైదరాబాదులో విద్యా తత్వాన్ని పంచుకుంటూ, సంస్థ యొక్క సరళమైన, ఆవిష్కరణ ఆధారిత పాఠ్యాంశ ప్రణాళికలను వివరించారు. ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం కోసం ఐఐటీ హైదరాబాదులో టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు (టీఐపీ)ని నెలకొల్పామని, దీని సేవలు భారతదేశంలోని ఏ సంస్థలో విద్యనభ్యసించే వారికైనా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.
కాగా గీతం హైదరాబాదు అదన పు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం విశిష్ట ఆచార్యులు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, ప్రొఫెసర్ బీ.వీ.ఆర్. టాటా అతిథిని శాలువా, జ్జాపికలతో సత్కరించారు. స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా పర్యవేక్షణలో, లైఫ్ సైన్సెస్ అధ్యాపకురాలు డాక్టర్ జి. నిహారిక ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
లయోలా అకాడమీ, సుచిత్ర (130), సాయి సుధీర్ డిగ్రీ కళాశాల, ఈసీఐఎల్ (70), సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి (60) పాటు గీతం విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.