calender_icon.png 3 December, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లగతి ఇంతేనా..?

03-12-2025 12:00:00 AM

ప్రమాదకరంగా ప్రయాణం 

మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల పరిధిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారు లకు మరమ్మతులు నిర్వహించకుండా వదిలేశారని, దీనితో ఆయా మార్గాల్లో ప్రయా ణం ప్రమాదకరంగా మారిందని ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇనుగుర్తి నుండి చిన్న ముప్పారం వెళ్లే మార్గంలో పలుచోట్ల వరదలకు రోడ్డు పూర్తిగా సగానికి పైగా కొట్టుకుపోయింది.

అలాగే నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి, శ్రీరామగిరి, వెంకటాపూర్, రాజుల కొత్తపల్లి, తారా సింగ్ భావి తండా, లాలు తండా మార్గాల్లో పలుచోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. దెబ్బతిన్న రోడ్లకు కనీసం మట్టి పోసి గోతులను కూడా తాత్కాలిక మరమ్మత్తులు చేయకపోవడంతో రోడ్లు ఇరుకుగా మారి ప్రయాణానికి సంకటంగా మారాయి. ఆయా మార్గాలు మండల గ్రామస్థాయి నుండి జిల్లాకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు వినియోగిస్తున్నారు.

వాహనాల రాకపోకలకు దెబ్బతిన్న చోట తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రిపూ ట మరింత ప్రమాదకరంగా మారి, చాలాసార్లు ప్రమాదాలు చోటుచేసుకుం టున్నా యని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టకపోవడంతో అక్టోబర్ చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మరింత అద్వానంగా మారిపోయాయని, కనీస రవాణా సౌకర్యం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న గ్రామీణ ప్రాంత రహదారులకు మరమ్మతులు నిర్వహించి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగితేనే  స్పందిస్తారా

భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదు. మళ్లీ కురిసిన వర్షానికి గతంలో దెబ్బతిన్న రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారాయి. రాత్రిపూట పరిస్థితి అద్వానంగా ఉంది. ప్రమాదాలు జరిగి ప్రాణా పాయం జరిగితేనే పట్టించుకుంటారా. వ్యవసాయదారులకు, ట్రాక్టర్లు వెళ్లడానికి రోడ్లు ఇరుకుగా మారిపోయాయి. వెంటనే మరమ్మతులు నిర్వహించి వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. 

జాటోత్ హరిచంద్, చిన్యా తండా