పాతికేళ్ల సవాళ్లకు సిద్ధంకండి
పోలీసింగ్‌లో ఏఐ అస్త్రం
కృత్రిమ మేధతోనే నేరస్థుల ఆటకట్టు
- పోలీస్ వ్యవస్థ బలోపేతానికి నిధుల కొరత లేదు
- ఫలితాలు సాధించి చూపించాలి
- పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): సమాజంలో శరవేగంగా మా రుతున్న నేరాల స్వరూపాన్ని పసిగట్టి, రాబో యే పాతికేళ్ల సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ సర్వస న్నద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తక్కువ జనాభా, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు మూస పద్ధతిలో ఒకేలా సిబ్బందిని కేటాయించే పాత విధానానికి స్వస్తి పలికి, జనాభా ప్రాతిపదికన సిబ్బందిని విభజించే రేషనలైజేషన్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని సూచించారు.
సోమవారం నగర శివారులోని ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరై దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ రెడీ లక్ష్యంతో పోలీ సు ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా వివరించిన అంశాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
నేరాల స్వరూపం మారిపోయి సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి సరికొత్త సవాళ్లు ముంచుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల ను నిరోధించడానికి, నేరస్థులను క్షణాల్లో పసిగట్టడానికి కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పోలీస్ శాఖ విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించా రు.
కేవలం టెక్నాలజీ వాడటమే కాకుండా.. రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్లో ఏ సమాచా రం కావాలన్నా నిమిషాల్లో ఆన్లైన్లో పొం దేలా పోలీస్ శాఖలోని మొత్తం డేటాను ఇం టిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో కనెక్ట్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ స్థానంలో ఉందని, ఇందు కు పోలీసు శాఖను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
అయితే 2047 నాటికి నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను చేరుకోవడానికి పోలీసు వ్యవస్థను మరింత ఎంపవర్ చేయాల్సి ఉంద న్నారు. ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన వి ధానాలు, వాటికి చట్టబద్ధత కల్పించే అం శాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు సీ ఎం సంచలన ప్రకటన చేశారు.
ఈ కమిటీలో రవాణా, ఆర్థిక, న్యాయ శాఖల ప్రత్యేక కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపా లనాపరమైన అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా చర్చించిన తర్వాత పోలీస్ శాఖ ప్రతిపాదనలకు చట్టరూపం కల్పించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడిం చారు. పోలీస్ వ్యవస్థ బలోపేతానికి నిధుల కొరత లేదని, ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న నమ్మకం, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టగలమన్న విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత పోలీసు అధికారులదేనని తేల్చిచెప్పారు.
పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది కదా అని ఇక సమాజంతో మనకు పనిలేదన్న భావన ఏ అధికారిలోనూ రావొద్దని సూచించారు. ఉన్నతస్థాయి అధికా రులు క్షేత్రస్థాయి సిబ్బందితో అనుసంధానం ఏర్పరచుకుని, కింది స్థాయి సిబ్బంది కి తగిన గౌరవం ఇచ్చినప్పుడే పోలీసు శాఖ మానవీయ దృక్పథం కలిగి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ తదితరులు పాల్గొన్నారు.




