10 March, 2026 | 7:45 AM

నేడు శాఖలవారీగా ప్రీబడ్జెట్ సమావేశాలు

10-03-2026 03:12 AM

 మంత్రులు, అధికారులతో భేటి కానున్న డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం సచివాలయంలో తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో వేర్వేరుగా సమావేశాలు  సమావేశం ఏర్పాటు చేయ నున్నారు. 

శాఖల వారీగా ప్రీబడ్జెట్ సమావేశం  

మంత్రులు                        సమయం 

డీ శ్రీధర్‌బాబు   ఉదయం 11 నుంచి 11.30 వరకు 

జీ వివేక్         ఉదయం 11.30 నుంచి 12 వరకు 

డీ సీతక్క           మధ్యాహ్నం 12.30 నుంచి ౧వరకు 

పీ శ్రీనివాస్‌రెడ్డి    మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు 

కొండా సురేఖ            మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు 

జూపల్లి కృష్ణారావు        మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు 

వాకిటి శ్రీహరి               మధ్యాహ్నం 3 నుంచి 3.30 వరకు 

రాజనరసింహ       మధ్యాహ్నం 3.30 నుంచి 4 వరకు 

తుమ్మల నాగేశ్వర్‌రావు సాయంత్రం 4 నుంచి 4.30 వరకు 

మున్సిపల్ శాఖ        సాయంత్రం 4.30నుంచి 5 వరకు 

హోం శాఖ               సాయంత్రం 5 నుంచి 5.30 వరకు 

విద్యాశాఖపై                సాయంత్రం 5.30 నుంచి 6 వరకు