17 April, 2026 | 11:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జీహెచ్‌ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు

06-06-2025 12:12 AM

హాజరైన డిప్యూటీ మేయర్ శ్రీలత 

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. గురువారం ఈ ముగింపు కార్యక్ర మానికి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ క్యాంప్ ద్వారా పిల్లల క్రీడా ప్రతిభ, కళా నైపుణ్యాలను వెలికితీసే అవకాశం లభించిందని అన్నారు.

సమ్మర్ క్యాంప్‌లో క్రీడలు, కళలు, సంగీతం, పర్యావరణ అవగాహన వంటి అనేక అంశాలను పిల్లలు ఆసక్తిగా నేర్చుకున్నారు. ముఖ్యంగా, యువత అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుర్తుచేస్తూ, క్రీడా మైదానాల అభివృద్ధి, శిక్షణా శిబిరాలు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం వంటి పథకాల గురించి ఆమె వివరించారు.

కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులు, శిక్షకులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి డిప్యూటీ మేయర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రస న్న, అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ యాదగిరి, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, సుభాష్ రావు, రామాంజనేయులు, రాజు నాయక్ పాల్గొన్నారు.