calender_icon.png 8 June, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దయ్యాలు..కయ్యాలు!

25-05-2025 12:13:02 AM

దయ్యాలు ఎవరు? ఆ ద య్యాలు ఏం చేస్తున్నాయి? ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరు, కేసీఆర్ ప్రసంగంపై ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పాజిటివ్, నెగెటివ్ పాయిం ట్లు అంటూ రాసిన లేఖ మీడియాలో ప్రత్యక్షమై తీవ్ర దుమారాన్ని రేపింది.

లేఖ మీడియాలో వెలుగు చూసిన మర్నాడే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కవిత ఎయిర్ పోర్టులో.. కేసీఆర్ దేవుడని చెప్తూనే ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ క్యాడర్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

పార్టీలో దయ్యాలుగా వ్యవహరిస్తున్నది ఎవరు? అనే ప్రశ్నలే ఆసక్తికరంగా మారాయి. కవిత చెప్తున్నట్లు నిజంగానే గులాబీ పార్టీ బాస్ చుట్టూ ఉన్న ఈ శక్తులు దయ్యాలుగా తయారై పార్టీని నష్టం చేస్తుంటే ఆ నష్టం ఏ మేరకు ఉందనే చర్చలు జోరందుకున్నాయి. దయ్యాలను కేసీఆర్ వదిలిస్తారా? ఏం చేస్తారు? అసలు పార్టీలో ఏం జరుగుబోతోంది..ఈ కయ్యాలకు ఎండ్ కార్డు పడుతుందా లేదా సస్పెన్స్ అట్లాగే కొనసాగనున్నదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుందంటున్నారు విశ్లేషకులు.

తమ్మనబోయిన వాసు