తెలంగాణ వార్డ్ సభ్యుల ఫోరం జిల్లా కన్వీనర్‌గా గులాం జావిద్
24-07-2026 12:37 PM
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సంక్షేమం, హక్కుల సాధన లక్ష్యంగా రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అనుబంధంగా తెలంగాణ వార్డ్ సభ్యుల ఫోరం ఆవిర్భవించింది. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఆవిర్భావ సభలో ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్‌గా గులాం జావిద్‌ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, జనరల్ సెక్రటరీ మట్ట శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు కవిత, గౌరవ అధ్యక్షుడు కనకమామిడి విష్ణు, రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర సురేష్ పాల్గొని గులాం జావిద్‌కు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






