24 July, 2026 | 1:17 PM

తెలంగాణలో నీట్ నిరసన: విద్యాసంస్థలు బంద్

24-07-2026 12:02 PM

హైదరాబాద్: నీట్ పరీక్షల(NEET exams) నిర్వహణలో జరిగిన అవకతవకలకు నిరసనగా వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో శుక్రవారం విద్యాసంస్థలు బంద్ పాటించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Union Education Minister Dharmendra Pradhan resigns) చేయాలని, నీట్-యూజీ పేపర్ లీక్‌లో(NEET-UG Paper Leak) దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టలక్ష్మణ్ తెలిపారు.  SFI, AISF, PDSUలతో కూడిన విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు.

నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో, నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంపై శుక్రవారం హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రకటించాయి. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో పార్టీ విద్యార్థి విభాగం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పాల్గొంటారు. ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగే ర్యాలీకి రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా, జూలై 24న జరగాల్సిన అన్ని పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలో తెలియజేస్తామని యూనివర్సిటీ వెల్లడించింది.