24 July, 2026 | 12:22 PM

కేటీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

24-07-2026 11:43 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం(KTR birthday) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు సంబురాలు జరుపుకుంటున్నారు.