24 July, 2026 | 12:08 PM

తరగతులు బహిష్కరించిన ఇంటర్ విద్యార్థులు

24-07-2026 11:35 AM

బోథ్, జులై 24(విజయక్రాంతి): ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఇంటర్ విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు బందుకు పిలుపు ఇవ్వడంతో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. కాగా కొన్ని ప్రైవేట్ పాఠశాల వారు సహితం సెలవు ప్రకటించడంతో పాఠశాలలు మూతపడ్డాయి.