31 August, 2026 | 11:43 PM

వేవ్ రాక్‌లోని రూ.2,200 కోట్ల వాటాను కొనుగోలు చేసిన జీఐసీ

09-06-2024 02:30 AM

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ హైదరాబాద్‌లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో తన వాటాను రూ.2,200 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. టీఎస్‌ఐ బిజినెస్ పార్క్స్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్‌ఐబీపీహె)లోని ఈ వాటాలను సింగపూర్‌కు చెందిన జీఐసీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 2019 డిసెంబర్‌లో టీఎస్‌ఐబీపీహెలోని వాటాలను షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్, అలియాంజ్ రియల్ ఎస్టేట్ సంయుక్త భాగస్వామి కంపెనీ ఎస్పీఆర్‌ఈఎఫ్ తీసుకుంది. గచ్చిబౌలిలో 2.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐటీ స్పెషల్ సెజ్ వేవ్ రాక్ టీఎస్‌ఐబీపీహె సొంతం. ఈ నేపథ్యంలో వేవ్ రాక్‌లోని ఈ వాటాను జీఐసీకి విక్రయించారు.