ఉద్యోగులకు పదవి విరమణ సహజం

31-08-2026 | 11:18pm

రామచంద్ర రెడ్డి రమాదేవి దంపతులను సన్మానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది అధ్యాపకులే అని,  అలాంటి ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.  సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్ల రామచంద్ర రెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ రమణారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, అధ్యాపకులు నిత్యం విద్యార్థుల వలె వ్యవహరిస్తూ విద్యార్థుల చక్కటి జీవితానికి బంగారు బాటలు వేస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతూ వారు అనుకున్న స్థాయికి చేరుకునేలా విద్యాబోధన చేస్తూ వారిని చక్కటి స్థాయికి చేరుకునేలా విద్య బోధన చేస్తూ సహకరిస్తారని అన్నారు. రామచంద్ర రెడ్డి పదవి విరమణ పొందడం బాధాకరమైన ఉద్యోగులకు విరమణ తప్పదు అన్నారు. పదవి విరమణ చేసిన ప్రిన్సిపాల్ నల్ల రామచంద్రారెడ్డి రమాదేవి దంపతులను ఎమ్మెల్యే విజయ రమణారావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. 

మరిన్ని వార్తలు