calender_icon.png 4 December, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్ధలతో గిరి ప్రదర్శన

04-12-2025 01:19:01 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటి పరిధిలోని మోదేల శివారులోనీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయం వద్ద గురు వారం ఎనిమిదవ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షట్టిపేట పట్టణ పురోహితులు కొత్తపళ్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయ స్వయంభు వెలిసిందని,  ఆలయ  నిర్మాణం కోసం భక్తులు వస్తురూపేన, ధన రూపేన,  శ్రమరూపేన అందరూ  కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనీ భక్తులు గుట్టపై వెలసిన స్వామివారిని ఈ మార్గశిర మాసంలో దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తెలిపారు. గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి  పంచామృతాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివ శంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.