calender_icon.png 4 December, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత ప్రమాదకర పరిస్థితిలో అత్యాధునిక చికిత్స

04-12-2025 12:26:55 PM

సరైన చికిత్స చేసి కవలల ప్రాణాలు నిలబెట్టింది

యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ డా. జి. ఆదిత్య, 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తీవ్ర శ్వాసకోశ సమస్యలు, సెప్సిస్, థ్రాంబోసైటోపీనియా వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో మెరుగైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడిన అరుదైన వైద్య సేవలను యశోద ఆసుపత్రి అందిస్తుందని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ డా. జి. ఆదిత్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్య బృందం ప్రత్యేకంగా సంభాషించారు. ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, సెప్సిస్, అప్నియా, తక్కువ బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు వేగంగా ప్రాణాంతక స్థితికి దారి తీస్తాయని,ఇలాంటి పరిస్థితి ఒక బిడ్డలో కనిపించినా అత్యంత ప్రమాదకరం; అదే సమయంలో కవలలు ఇద్దరిలోనూ ఒకేసారి కనిపిస్తే చికిత్స మరింత క్లిష్టమవుతుందన్నారు. అటువంటి అరుదైన, అత్యంత ప్రమాదకర పరిస్థితిలో మలక్‌పేట్ యశోదా హాస్పిటల్ నిక ఎన్ఐసీయూ వైద్య బృందం 29 వారాల్లో పుట్టిన కవల పిల్లల ప్రాణాలను విజయవంతంగా కాపాడగలిగిందన్నారు. 

కేసు వివరాలు..

31 సంవత్సరాల తల్లికి పుట్టిన ప్రీ టర్మ్ ట్విన్స్ ను (అమ్మాయి, అబ్బాయి) పుట్టిన వెంటనే తీవ్ర శ్వాస సమస్యలతో, సెప్సిస్ అనుమానంతో యశోదా మలక్‌పేట్   ఎన్ఐసీయూకి తరలించారని పేర్కొన్నారు. కన్సల్టెంట్ నియోనేటాలజిస్ట్, పీడియాట్రీషియెన్ డా. సత్యప్రియ సాహు, క్రిటికల్ కేర్ మెడిసిన్ కన్సల్టెంట్ డా. జి.ఆదిత్యల ఆధ్వర్యంలోని నిపుణులైన మలక్ పేట్ యశోదా ఆసుపత్రి వైద్యబృందం వెంటనే స్పందించి, సకాలంలో సరైన చికిత్స చేసి కవలల ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలిపారు. ప్రీమెచ్యూర్ బేబీస్ మరియు క్రిటికల్ న్యూ‌బోర్న్ కేసులను సైతం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక ఎన్ఐసియూ సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందాలు యశోదా ఆసుపత్రి శాఖలన్నింటిలోనూ అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోదా వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని మలక్ పేట యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. ఈ కార్యక్రమం. , కన్సల్టెంట్ నియోనేటాలజిస్ట్  డాక్టర్ సత్యప్రియ సాహూ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డా. జి. ఆదిత్య,  తదితరులు ఉన్నారు. వివరాలకోసం సంప్రదించాల్సిన నెంబర్లు - ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230, 99499 98378 సంప్రదించాలని తెలిపారు.