12 March, 2026 | 4:49 AM

ఓయూ హాస్టళ్లలో గ్యాస్ సిలిండర్ల కొరత కట్టెల పొయ్యిలపై వంటలు

12-03-2026 01:13 AM

సికింద్రాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో గ్యా స్ సిలిండర్ల కొరత కారణంగా హాస్టల్ విద్యార్థుల కోసం కట్టెల పొయ్యిలపై వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా భారత్ గ్యాస్, హెచ్పీసీఎల్ వంటి గ్యాస్ కంపెనీల నుంచి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యపై ముందస్తు గా యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందిన నేపథ్యంలో విద్యా ర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.

ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న కీలక సమయంలో విద్యా ర్థులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో హాస్టల్ ఆవరణలో ప్రత్యేకంగా రేకుల షెడ్లు ఏర్పా టు చేసి కట్టెల పొయ్యిలపై వంటలు చేయిస్తున్నారు. వంట విధానం మారినప్పటికీ విద్యార్థులకు అందించే మెనూ లో ఎలాంటి మార్పులు చేయలేదని, పౌష్టికాహారాన్ని యథావిధిగా అంది స్తున్నామని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.