calender_icon.png 21 February, 2026 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సమయంలో మాజీ ప్రిన్స్ అక్కడే ఉన్నాడు

21-02-2026 02:12:14 AM

ఆండ్రూ ఎదుటే బాలికకు విద్యుత్ షాక్

లండన్, ఫిబ్రవరి 20: ఎప్‌స్టీన్ సెక్స్ రాకె ట్ వ్యవహారంలో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే దీనికి సంబంధించిన కేసులో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటెన్ విండర్స్‌ను పోలీసులు అరె స్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించి మరిన్ని ఆరోపణలు బ యటపడ్డాయి. బ్రిటన్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో ఆం డ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఆ బాలికను టేబుల్‌పై బంధించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పినట్లు వెల్లడించాయి. ఈ ఆరోపణలు ఎఫ్‌బీఐ(అమెరికాకు చెందిన లాఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ) పత్రాల్లో ఉన్నాయి. ఈ ఘటన బ్రిటన్‌లోని ఫ్రాగ్మోర్ కాటేజీలో జరిగిందని ఆ కథనాలు వెల్లడించాయి. అయితే ఆండ్రూ మాత్రం తనపై వచ్చిన ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు. 1994 నుంచి 1996 మధ్యలో హ్యూమన్ ట్రాఫికిం గ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆ రోపణల గురించి అవగాహన ఉందని సర్రే పో లీసులు తెలిపారు.

అయితే దానిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఈ రెండు ఘటనలకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆరోపణలకు సం బంధించి ఎవరివద్ద అయినా సమాచారం ఉంటే తమ కు రిపోర్ట్ చేయాలని కోరారు. కాగా.. అమెరికాలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు పెట్టుకో వడమే కా కుండా.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై అండ్రూను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటలు విచారించిన అనంతరం అం డ్రూ విడుదలయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి అభియోగాలు మోపలేదు.