ప్రియురాలి పిలుపు.. ప్రియుడిపై దాడి
చార్మినార్, మే 24 : రహస్యంగా ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడిని అమ్మాయి తండ్రి చూసి దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రియురాలి ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్లి ఆ యువ కుడు గడియ పెట్టుకున్నాడు. నన్ను చంపేయాలని చూస్తున్నారు అంటూ 100 డయ ల్ చేసి విషయం పోలీసులకు వివరించాడు. వెంటనే అలర్ట్ అయిన బండ్లగూడ పోలీసులు దాడి జరిగిన ఇంటికి వెళ్లి ఆ యువ కుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గౌస్‌నగర్‌కు చెందిన గ్యాస్ రిపేర్ పని చేసే అబ్దుల్ సోహెల్ (25), ఇదే ప్రాంతంలో ఏడాది క్రితం ఓ ఇంట్లో గ్యాస్ పని చేయడానికి వెళ్లా డు.
ఇంట్లో పని చేస్తూనే ఇంటి ఓనర్ కూతు రు మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో మూడు నెలల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక తండ్రి అప్పట్లో బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి అబ్దు ల్ సోహెల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి అబ్దుల్ సోహైల్ వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు.. మనకు కొడుకు పుట్టా డు.. వచ్చి చూడండి అంటూ ఫోన్ చేసింది.
దీంతో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాల సమయంలో సోహైల్ ప్రియురాలి ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించాడు. సో హెల్ ఇంట్లోకి ప్రవేశించడాన్ని ప్రియురాలి తండ్రి సీసీ కెమెరాల్లో చూసి దాడి చేశాడు. దాడిని తప్పించుకునేందుకు సోహెల్ ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. 100కు డ యల్ చేసి సెల్ఫీ వీడియో ద్వారా తనపై దాడి జరుగుతుందని వెంటనే వచ్చి రక్షించాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. రంగంలోకి దిగిన బండ్లగూడ పోలీసులు దా డి జరిగిన ఇంటికి వెళ్లి గదిలో నుంచి సోహైల్‌ను బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు.






