30 July, 2026 | 9:51 AM

అమ్మకానికి చిన్నారులు

29-05-2024 01:25 AM

పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని.. 16 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు

రూ.50 వేలు, రూ.1 లక్షకు కొనుగోలు చేసి.. రూ.1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (విజయక్రాంతి): నెలలు కూడా నిండని చిన్నారులను తల్లిదండ్రులకు దూరం చేస్తారు. కాసులకు కక్కుర్తి పడి చిన్నారులను నిర్ధాక్షిణ్యంగా విక్రయిస్తారు. సంతానం లేని వారే వారి టార్గెట్. పోలీసుల చొరవతో ఇప్పుడు ఆ ముఠా గుట్టురట్టయ్యింది. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ను రాచకొండ  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 16 మంది చిన్నారులను రక్షించారు. కాపాడిన చిన్నారులను పోలీసులు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరిలో కొంద రు ఇతర  రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. 

మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చిన్నారి విక్రయం జరిగినట్లుగా మన్యం సాయికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా తెరపైకి వచ్చిం ది. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కమిషనర్ తరుణ్ జోషి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒక నెల వయస్సు బేబీ నుంచి 2 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల వరకు ఈ ముఠా విక్రయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మన్యం సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.

దీంతో చిన్నారులను కొనుగోలు చేసి, విక్రయించే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించినట్లుగా కమిషనర్ తెలిపారు. ఈ ముఠా సంతానం లేని వారిని గుర్తించి, తక్కువ ధరకు చిన్నారులను కొనుగోలు చేసి అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, పుణె తదితర ప్రాంతాలలో పేదరికంతో ఉండే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి, రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు కొనుగోలు చేసి వారిని నగరంలోని పిల్లలు లేని వారికి రూ.1.80 లక్షల నుంచి రూ.౫.౫౦ లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారనీ సీపీ తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారులను కొనుగోలు చేసిన వారి నుంచి 16 మందిని పోలీసులు  కాపాడారు. ఈ రాకెట్‌తో సం బంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మంది  నిందితులు బండా రి హరిహర చేతన్(34), బండారి పద్మ(65), బలగం సరోజ(32), ముదావత్ శారద(39), ముదావత్ రాజ(30), పథన్ ముం తాజ్(28) అలియస్ హసినా, జగనాధం అనురాధ(27), యాట మమత(30)లను  అరెస్ట్ చేశామన్నారు. ఇందులో బండారి పద్మ, బలగం సరోజ, మదావత్ శారదలపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. అరెస్టున వారిని రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ, ఇక నుంచి ప్రేమగా చూసుకుంటామని సీపీని కోరారు. పిల్లలను పోలీసులు శిశువిహార్‌కు తరలించారు.