18 April, 2026 | 6:12 PM

అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాలి

29-05-2025 08:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): అమ్మాయిలు ఆత్మస్థైర్యాన్ని నింపాలని కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ సులోమీకరణ కోర్సు డైరెక్టర్ రమాదేవి(Course Director Ramadevi) అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. బోధనలు నైపుణ్యత శిక్షణ తరగతులు ఆడపిల్లలు మహిళల ఆత్మస్తీర్ణంపై ఆమె మాట్లాడారు. 

కేజీబీవీ వసతి గృహాల్లో, గురుకులాల్లో చదువుతున్నటువంటి వేల మంది  విద్యార్థినులకు, బాలికలకు లైంగిక వేధింపుల పైన బాలికలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా పైన అవగాహన కల్పించడం కోసం 42 మంది మహిళా ఉపాధ్యాయులను  శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు అనంతరం వారు విద్యార్థుల్లోపల చైతన్యాన్ని నింపి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.