ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి గొడవ పడగా ఒకరు మృతి..
మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం(Manoharabad Mandal) కాల్లకల్ పరిధిలోని కిసాన్ ఇండస్ట్రీస్ ఎస్ఎల్ఎల్సిపి కంపెనీలో ఇద్దరూ స్నేహితులు కేరళ రాష్ట్రానికి చెందినవారు బ్రతుకుదెరువు నిమిత్తం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు కలిసి మద్యం సేవించిన అనంతరం వ్యక్తిగత దూషణతో గొడవ పడగా నలీన్ అనే వ్యక్తి క్రింద పడగా తలకు భారీ గాయం కావడంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నాగేందర్ గౌడ్(DSP Nagender Goud), సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ లు ఘటనా స్థలికి చేరి మృతుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. మృతుడితో పాటు ఉన్న వ్యక్తి పరారీలో ఉండగా తూప్రాన్ సిఐ. రంగాకృష్ణ వీరి సిబ్బంది కలసి పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.






